Monday, January 27, 2025

బిఆర్‌ఎస్ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరి జన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే బిఆర్‌ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో తక్కువ మందితోనే ధర్నా కార్య క్రమం నిర్వహించే అవకాశం ఉంది. మహబూబాబాద్‌లో గిరిజన రైతుల మహాధర్నాకు అనుమతి కోరుతూ బిఆర్‌ఎస్ పార్టీ పోలీసుల అనుమతి కోరింది.

కానీ, పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. తొలుత పోలీసులు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో బిఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా జిల్లా ఎస్‌పి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. మహా ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు కదిలేది లేదని ప్రకటించారు. చివరకు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును బిఆర్‌ఎస్ నేతలు ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం బిఆర్‌ఎస్ మహాధర్నాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిఆర్‌ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. సిఎం రేవంత్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆయన ఇదేం పాలన అంటూ సిఎం రేవంత్‌పై ఘాటైన విరమ్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News