Friday, November 22, 2024

జీవో 111పై కమిటీ నివేదిక ఎందుకివ్వడంలేదు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

TS HC Hear on Dalit Bandhu Scheme

హైదరాబాద్: జీవో 111పై మరోమారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో విచారించింది. గురువారం ఉదయం విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏంటన్న సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని అదనపు ఏజీ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని, ఆలోపు నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీని రద్దు చేస్తామన్న హైకోర్టు హెచ్చరించింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని, నివేదికను వెబ్ సైట్ లో పెట్టాలని కమిటీకి కమిటీని ఆదేశించింది. కమిటీ నివేదికపై సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Telangana High Court heard on GO 111

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News