Thursday, November 21, 2024

పోడు భూములపై హైకోర్టులో విచారణ..

- Advertisement -
- Advertisement -

Telangana High Court heard on Podu Lands 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పోడు భూములపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోడు భూముల్లో ఉన్న రైతులను బలవంతంగా ఖాళీగా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది తీగల రామ్ ప్రసాద్ కోర్టును కోరారు. రైతుల తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. కేసులో తెలంగాణ ప్రభుత్వంతోపాటు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లను ప్రతి వాదులుగా చేర్చారు పిటిషనర్లు. పోడు రైతులు దాఖలు చేసిన ఈ పిటీషన్ పై చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ విచారణ చేపట్టి ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ ధాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.

Telangana High Court heard on Podu Lands 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News