Wednesday, March 19, 2025

హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

కోర్టును తప్పుదోవ పట్టించినందుకు పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా
విలువైన సమయాన్ని వృథా చేశారని న్యాయస్థానం ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ కేసు లో పిటిషనర్ కోర్టును తప్పుదో వ పట్టించినందుకు గాను హైకోర్టు న్యాయమూ ర్తి నగేశ్ సంచలన తీ ర్పును వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పి టిషనర్ వెంకట్రామిరెడ్డికి రూ.కోటి జరిమానా విధించారు. బండ్లగూడ మండలం కందికల్‌లో సర్వే నెంబర్ 310/1, 310/2లలో 9.11 ఎకరాల భూమి
గ్రామంలో లేవని, ఆ గ్రామంలో 309/5తోనే సర్వే నెంబర్ ముగుస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. తప్పుడు పత్రాలు సృష్టించి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తు న్నారని వివరించారు. ఈ భూమిపై గతంలోనే పిటిషనర్ తండ్రి హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారని, వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఆయన విరమించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ల గురించి వెంకట్రామిరెడ్డి తన అఫిడవిట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కందికల్‌లో ఉన్న ప్రభుత్వ భూమిపై ఇప్పటికే యాజమాన్య హక్కులపై కేసులు నడుస్తున్నాయని, పాత పిటిషన్ల గురించి చెప్పకుండా వెంకట్రామిరెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభ వించింది. కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ బీమపాక ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News