- Advertisement -
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జనవరి 31 వరకు జరిగే పరిణామాలను పరిశీలిస్తామని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాఠశాలలు తెరిచాక ఇతర ఫీజుల పేరుతో అధిక వసూళ్లు చేయరాదని స్కూలు యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆన్‌లైన్ విద్య పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఫీజుల వసూలుపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు జివొ 46 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.
Telangana High Court Inquiry on online fees
- Advertisement -