Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నేడు తెలంగాణ హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో భారతీయ జనతా పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు ఈ నోటీసులు ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని నాడన్నారు. అంతేకాక 1925 నాటికల్లా దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రతినబూనిందన్నారు. ఆ కుట్రలో భాగంగానే దేశాన్ని హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.

ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. అయితే కింది కోర్టులు పదేపదే వాయిదా వేస్తుండడంతో వెంకటేశ్వర్లు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News