Monday, September 23, 2024

కెఏ పాల్ పిటిషన్ పై పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలకు హైకోర్టు నోటీసులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ‘ప్రజాశాంతి పార్టీ’ అధ్యక్షుడు కెఏ.పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు,  పది మంది బిఆర్ఎస్ ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేసింది.

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధం  అని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కెఏ.పాల్ తన పిటిషన్ లో కోరారు. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ బిఆర్ఎస్ టికెట్ పై గెలుపొంది, ఆరునెలలు గడవక ముందే మరో పార్టీలోకి జంప్ చేశారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాజీనామా చేయకుండ వేరే పార్టీలో చేరడం తప్పని, అది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాగలదని వాదించారు. కెఏ. పాల్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 10 మంది బిఆర్ఎస్ ఎంఎల్ఏ లకు నోటీసులు జారీ చేసింది. ఇదివరలో స్పీకర్ కూడా తాకీదులు కూడా జారీ చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసును విచారిస్తామని అసెంబ్లీ స్పీకర్ కు స్పష్టం చేసింది. ఇప్పుడు కెఏ.పాల్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు  ఫిరాయింపు ఎంఎల్ఏలను మరింత ఇరకాటంలో పడేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News