Friday, December 20, 2024

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం..మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

పోలీసులు అరెస్టు చేయుకండా ఉండేందుకు మంచు మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం అడిగారు. దీంతో కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ లోపు తన క్లయింట్ ను పోలీసులు అరెస్టు చేస్తారేమోనని అప్పటి వరకూ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్‌బాబు న్యాయవాది కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ ప్రకారం మోహన్‌బాబును పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే అడ్డంకులు లేవని అనుకోవచ్చు. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అది పోలీస్ స్టేషన్లు, కేసుల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఈ విషయాలు రిపోర్టు చేయడానికి మీడియా జల్ పల్లిలోని మంచు ఇంటి ముందు పడిగాపులు పడింది.

గొడవ జరిగిన రోజున మంచు మనోజ్ ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనతో పాటు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడికి దిగారు. ఓ టీవీ చానల్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్లు చేశారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. అంతకు ముందే ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గన్స్ సరెండర్ చేయాలని అందులో పేర్కొన్నారు. పోలీసుల ఎదుట హాజరు కాకుండా కోర్టుకు వెళ్లి ఊరట పొందిన ఆయన గన్స్ మాత్రం పోలీసులు రెండు సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత సరెండర్ చేశారు. ఓ తుపాకీని చంద్రగిరిలో మరో తుపాకీని ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు అదే కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన రాచ కొండ సిపి సుధీర్ మోహన్ బాబుకు కోర్టు ఇరవై నాలుగో తేదీ వరకు గడువు ఇచ్చిందన్నారు.

ఆయనను అరెస్టు చేయడంలో ఎలాంటి ఆలస్యం లేదన్నా రు. అయితే పోలీసు ఎదుట హాజరు కాకుండా మాత్రమే హైకోర్టు చాన్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఇప్పుడు హైకోర్టు అరెస్టు విషయంలో రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు తన దాడిలో గాయపడిన టివి జర్నలిస్టును కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News