Monday, January 20, 2025

కెటిఆర్ కు హైకోర్టు బిగ్ షాక్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన ఈ ఫార్ముల కేసుపై ఏసీబీ విచారణ జరపొచ్చు అని న్యాయస్తానం తీర్పు వెల్లడించింది. తనపై నమోదైైన ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ కోరుతూ.. కెటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఆయన పిటిషన్ ను తిరస్కరించింది.

అంతేకాదు.. ఈ కేసుపై విచారణను కొనసాగించేందుకు ఏసీబీకి న్యాయస్తానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, 10 రోజులపాటు కెటిఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ నెల 30 వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కాగా, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫార్ముల ఈ రేసులో రూ.55 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం.. అవినీతికి పాల్పడిన కెటిఆర్ పై విచారణకు ఆదేశించింది. దీంతో ఏసీబీ ఆయన కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News