Monday, December 23, 2024

జివొ 317పై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Telangana High court refuses to Stay on GO 317

హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై సిజె జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టింది. ఈక్రమంలో జివొ నం. 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోరారు.కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని అదనపు ఎజి బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జివొ నం. 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులన్నీ పిటిషన్లపై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News