Monday, December 23, 2024

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసును ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ క్రమంలో రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.

అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉందంటూ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే దీనికి సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పినప్పటికీ హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేసిందని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు రంగనాథ్ ని ఆదేశించింది. నేరుగా లేదా ఆన్ లైన్ విచారణకు హాజరు కావాలని తెలిపింది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News