Sunday, December 22, 2024

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. వచ్చే సోమవారం 10.30 గంలకు ఖచ్చి తంగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉందని పేర్కొంది. కోర్టు ఆదేశాలను థిక్కరించి మరీ భవనాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లో ఒక భవ నాన్ని కూల్చివేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో హైడ్రా కమిషనర్ న్యాయస్థానానికి ఏం వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News