Wednesday, February 12, 2025

ప్రతినెలా ఎక్సైజ్ శాఖకు రూ.300 కోట్ల అదనపు ఆదాయం

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగడంతో లైట్ బీరుపై సుమారుగా రూ.30లు, స్ట్రాంగ్ బీరుపై రూ.40లు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడంతో పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క బీర్ల కేస్ మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180లు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగింది. పెరిగిన ధరల నేపథ్యంలో తెలంగాణలో ఒక్కో లైట్ బీర్‌పై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయల ధర పెరిగింది.

అంతేకాదు పాత స్టాక్ ఉంటే వాటిపై ఎమ్మార్పీ లేబుల్స్‌ను కూడా మార్చి పెంచిన రేటుకు అమ్మాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్లో దాదాపు 60 శాతం వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్‌ను మిగతా కంపెనీలు అనుసరించాయి. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ ధరలను 15 నుంచి 19 శాతం పెంచేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఇలా తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం రానున్నది వేసవికాలం కావడంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయి. దీంతో ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బీర్ల రేట్లు పెరగడంతో ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News