Saturday, November 23, 2024

వైమానికానికి తెలంగాణ తలమానికం

- Advertisement -
- Advertisement -

 

Telangana Home to aviation and defense companies

వైమానిక, రక్షణ రంగ సంస్థలకు నిలయంగా మారిన
రాష్ట్రం, టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమల
స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం దారులు వేసింది,
కేంద్ర విమానయాన సంస్థ నుంచి రెండుసార్లు
ప్రశంసలందుకుంది, లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్
అగ్రభాగాన నిలవాలి : టిఎల్‌ఎంఎఎల్ ఫైటర్ వింగ్
ప్రోటో టైప్ వేడుకల్లో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ ఆదిభట్ల : వైమానిక రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలకు తెలంగాణ నిలయంగా మారుతోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్ మార్టీన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్‌లో ఫైటర్‌వింగ్ ప్రోటోటైప్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైమానిక రక్షణ రంగ సంస్థలకు తెలంగాణ నిలయంగా మారుతోందని అన్నారు. విమానయాన ఉత్పత్తిలో తెలంగాణలోని ఏరోస్పేస్ సంస్థ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. టిఎస్‌ఐపాస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం దారులు పరిచిందని అన్నారు.

రెండు పర్యాయాలు కేంద్ర విమానయాన సంస్థ నుండి ప్రశంసలను అందుకుందని ఆయన గుర్తు చేశారు. టిఎల్‌ఎంఏఎల్‌తో లాక్‌హీడ్ మార్టీన్ భాగస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం లాక్‌హీడ్ మార్టీన్ ఇంటిగ్రేటెడ్ ఫైటర్‌గ్రూప్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అమీ బ్రూనైట్ మాట్లాడుతూ టిఎల్‌ఎంఎఎల్ లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యంతో సాంకేతికంగా అత్యంత క్లిష్టతరమైన ఏరోస్ట్రక్చర్స్ అయిన ఫ్యూయల్ క్యారీయింగ్ 9జి, 12000హవర్, ఇంటర్ చేంజబుల్, రీప్లేసబుల్ ఫైటర్‌వింగ్‌ను నిర్మించనున్నామని అన్నారు.

అనంతరం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్‌సింగ్ మాట్లాడుతూ..ఫైటర్ వింగ్ షిప్‌సెట్ ప్రోటోటైప్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తికావడం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యంలో ఓ మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈకార్యక్రమంలో యుఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్‌మాన్, లాక్‌హీడ్ మార్టీన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ విలియం బ్లేయర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఐమీ బర్నెట్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News