Tuesday, December 24, 2024

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎంబిఏ, ఎంసిఏ కోర్సులో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఐసెట్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధృవపత్రాల పరిశీలన, ఆగస్టు 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు.

ఆగస్టు 25న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News