Thursday, January 23, 2025

విద్యుత్ పంపిణీలో తెలంగాణ మెరుగు

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : విద్యుత్ పంపిణీలో తెలంగాణ మెరుగని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో 33/11 కెవి నూతన సబ్ స్టేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ పంపిణీలో అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 గంటల విద్యుత్ అమలు చేస్తున్నామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణంలో ఉండి మిగిలిపోయిన సబ్ స్టేషన్ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు.

దీంతో లో వోల్టేజి సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏడి శివ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి పెద్దింటి పద్మా వెంకటేష్, సర్పంచ్ సువర్ణ నరేందర్, విద్యుత్ ఏఈ కవిత, తహసిల్దార్ అబ్రహం లింకన్, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, మార్కెట్ మాజీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు యాదవ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News