Thursday, January 23, 2025

అభివృద్ధి పథంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి
  • ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు
  • దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి

హత్నూర:సిఎం కెసిఆర్ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చాలా దూరపు ఆలోచనతో దేశం తెలంగాణ వైపు చూసే విధంగా పక్క ప్రణాళికతో శాశ్వత కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజల మ న్ననలు చూరగొంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మిషన్ భగీరథ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండల బోర్పట్లలోని తాగునీటి శుద్ధీకరణ కేం ద్రంలో ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగలో పాల్గొన్నా రు. అంతకుముందు వాటర్ బెడ్‌లో జల శుద్ధీకరణ జరుగుచున్న తీరును మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మా రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా తదితర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మదన్ రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం మహిళలు ఎంతో గోస పడ్డారని, నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల దూరం బోర్లు, బావుల దగ్గరకు వెళ్లి నీ ళ్లు తెచ్చుకునేవాళ్ళని అన్నారు. సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే సిద్దిపేటలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారని, తెలంగాణా ఏర్పడ్డ తరువాత మంచినీళ్లకు మహిళలు ఇబ్బంది పడరాదనే ఛాలెంజ్‌గా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని గడపగడపకు నీటిని అందించిన నాడే తిరిగి ఓట్లు అడుగుతామని చెప్పి నీరందిస్తూ మాట నిలుపుకున్నారని అన్నారు. ఇలా ముఖ్యమంత్రి రాష్ట్రంలో సాహసోపేతంగా ఎన్నో సంస్కరణలు, సం క్షేమ పధకాలు అమలు చేస్తూ అన్నిరంగాల్లో పురోగమి స్తూ దేశం తెలంగాణా వైపు చూసేలా చేస్తున్నారని అన్నారు.

మెదక్ ఎమ్మల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గడపగడపకు శుద్ధీ చేసిన జలాలు అందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కాపాడన్నారు. గతంలో 5-6 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేయని, ఎండాకా లం వచ్చిందంటే మహిళలు కిలో మీటర్ల దూరం బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చేవారని, భుజాలు కాయలు కాసేవని, బోర్లు కొట్టి చేతులు పడిపోయేవని, ట్యాంకర్ల ద్వా రా సరఫరా చేసిన సరిపోయేవి కావని, గ్రామాలకు వెళ్లాలంటే మహిళలు బిందెలతో నిరసన తెలిపేవారని అన్నా రు. అటవీ, జాతీయ రహదారులు, రైల్వే అనుమతులు వంటి ఎన్నో అవాంతరాలు ఎదురైనా వెరవక రాష్ట్ర వ్యా ప్తంగా లక్షన్నర కిల్ మీటర్ల మేర పైపులైన్ వేసి ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించిన అపర భగీరథుడు కెసిఆర్ అని కొనియాడారు.

ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఏ సమస్యకైనా వెన్నుదరవక శాశ్వత పరిష్కా రం చూపేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నా రు. రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రె డ్డి మాట్లాడుతూ మనిషి జీవించడానికి, శరీరానికి 2/3 వంతు నీరు అవసరమని, గంగను దివి నుండి భువికి తె చ్చిన అపర భగీరధుడు కెసిఆర్ అన్నారు. గతంలో నీళ్ల కోసం పడ్డ కష్టాలు తలుచుకుంటే వణుకు పుట్టిస్తుందని, భూగర్భజలాలు అడుగంటి తాగునీటి, సాగునీటికి ఎన్నో కష్టాలు అనుభవించామన్నారు. మనం పదవిలో ఉన్న లే కున్నా ప్రజల అవసరాలను గుర్తించి శాశ్వత పరిష్కారా లు చూపించేవాడే నిజమైన నాయకుడని పలుమార్లు సిఎ ం అనేవారని గుర్తుచేశారు.

47 వేల కోట్లతో లక్షన్నర కి లో మీటర్ల పైప్ లైన్ వేసి ప్రజాదాహర్తిని తీర్చిన మహానుబాగావుడు కెసిఆర్ అని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఇంజనీర్ల అద్భుత సౄష్టి మిషన్ భగీరథ అని అన్నారు. ప్రపంచ స్థాయిలో తలదన్నే విధంగా ఇం జనీర్లు రేయింబవళ్లు ఎంతో కష్టపడి ప్రతి మారుమూల గ్రామ, తాండాలకు కూడా ఇంటింటికి స్వచ్ఛమైన జ లాలు అందిస్తున్నారన్నారు. మిషన్ భగీరథ విజయవంతంతో పలు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నారాయని, కేంద్రం కూడా హర్‌గర్ జల్ పధకాన్ని అమలుచేస్తున్నదని అన్నారు. జిల్లాలో 5 వేల కిలో మీటర్ల మేర పైప్ లైన్ తో పాటు కొత్తగా 668 ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించామని నేడు మంచినీళ్ల పండుగను జిల్లాలోని అన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల వద్ద పండుగ వాతావరణంలో నిర్వహించామన్నారు.

మిషన్ భగీరథ అడ్వైజర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ మిషన్ మోడ్‌లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌తోపాటు కొత్తగా 18 వేల ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించుకున్నామని, 57 లక్షల నల్లాలు ఏ ర్పాటు చేశామన్నారు. 11 రాష్ట్రాల ఇంజనీర్లు, ముఖ్యమంత్రులు పరిశీలించారన్నారు. ఆరు అవార్డులు కూడా వచ్చాయని అన్నారు. అసంఘటిత కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపిపిలు, నర్సింలు, హరికృష్ణ, యమునా జయ రాం రెడ్డి,జిల్లా పరిషత్ కో అప్షన్ మెంబర్ మన్సూర్, సర్పంచ్ అంజమ్మ, ఎంపిటిసిలు వెంకట్ రెడ్డి,విఠల్ రెడ్డి,మేఘమాల, మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మిషన్ భగీరథ ఈఈ కమలాకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుచ్చి రెడ్డి, హత్నూర మండల యూత్ ప్రెసిడెంట్ కిషోర్ పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News