- Advertisement -
హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే కరోనాను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇయర్ పరీక్షలకు 4.74 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించే చాన్స్ ఉంది. రికార్డ్స్ మార్కుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేయనున్నారు. బ్యాక్ లాక్ ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థులు మినిమం మార్కులతో పాస్ కానున్నారు.
- Advertisement -