Thursday, January 23, 2025

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహిస్తారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్ష జరుగుతోంది. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ప్రాక్టికల్స్ జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 16న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 28న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, మార్చి 1న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 4న మ్యాథ్స్‌ పేపర్‌-1A, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, మార్చి 6న మ్యాథ్స్‌ పేపర్-1B, హిస్టరీ పేపర్‌-1, జువాలజీ పేపర్‌-1, మార్చి 11న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, మార్చి 13న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News