Monday, January 20, 2025

ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగించాం: సబిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో మేడ్చల్ జిల్లాకు తొలి స్థానం దక్కగా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ములుగు జిల్లాకు అగ్రస్థానం దక్కింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని సబిత సూచించారు. విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సబిత పేర్కొన్నారు. 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

ఇంటర్ విద్యార్థుల కోసం టెలీ మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. 14416 నెంబర్‌కు పోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. సాయంత్రం నుంచి మెమోలు కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చన్నారు.

 

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News