Thursday, November 21, 2024

ఎల్లుండి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటయినా నో ఎంట్రీ!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బుధవారం నుంచీ ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి మీడియాతో మాట్లాడుతూ నిమిషం ఆలస్యమైనా పరీక్ష సెంటర్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని, ఎగ్జామ్ సెంటర్లలో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు.

మొత్తం 1521 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 200మంది సిటింగ్ స్క్పాడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు 9,80,978మంది విద్యార్థులు హాజరవుతారని శ్రుతి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీని కోరామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News