Saturday, November 23, 2024

తెలంగాణ నీటి పారుదల

- Advertisement -
- Advertisement -

నీటి పారుదల అంశం పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైనది. ఎందు కంటే..ఈ టాపిక్‌లో కనీసం 3 నుంచి 5 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే సులువుగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కష్టతరమే. ఈ టాపిక్ నుంచి ముఖ్యాంశా లను బాగా చదువుకుంటే మంచి మార్కులు సాధించే వీలుంది. నీటి పారుదల వ్యవసాయా నికి అతి ముఖ్యమైనది. ఖచ్చితమైన నీటి పారుదల అందించాలంటే రుతుపవనాలు కూడా సరైన సమయంలో రావాలి. నీటి పారుదల అందించినప్పుడు పంటసాగుతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.

Center that does not provide funding for irrigation water projects

నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి
1. మేజర్ నీటి పారుదల ప్రాజెక్టు, 2. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, 3.మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు.
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే పాతికవేల ఎకరాలకు పైబడిన ఆయకట్టుకు నీటిని అందించడం.
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు అనగా 5000 నుండి 25000 ఎకరాలు ఆయకట్టుకు నీటిని అందించడం.
మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనగా 5000 ఎకరాలకంటే తక్కువ ఎకరాలకు సాగునీటిని అందించడం.
తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ముఖ్యంగా రెండు నదులపై ఆధారపడి ఉంటుంది.
అవి కృష్ణ, గోదావరి నదులు.
కృష్ణా, గోదావరి నదుల మొత్తం నీటి వాటా 1266.94 టిఎంసీలు.
కృష్ణా, గోదావరి నదులకు అదనపు నీటి వాటా 500 టి.ఎం.సిలు.
కృష్ణానది ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు 967.94 టిఎంసిలు.
గోదావరి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు 299 టిఎంసిలు.
నోట్: టి.ఎం.సి అనగా తౌజెండ్ మిలియన్ క్యూబిక్.
భూగర్భ జల పథకాలు
నోట్: భూగర్భ జల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది.
6వ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ 201718 (ప్రొవిజనల్) ప్రకారం, భూగర్భ జల బావులు 4 రకాలు అవి. బావులు, లోతులేని గొట్టపు బావులు, మధ్యస్థ గొట్టపు బావులు.. లోతైన గొట్టపు బావులు.
మొత్తం భూగర్భజల బావులు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూగర్భ జల బావుల సంఖ్య 15,78,670.
అత్యధికంగా భూగర్భజల బావులు గల జిల్లా నిజామాబాద్ (1,15,431).
అత్యల్పంగా భూగర్భజల బావులు గల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్. (6,251).
అత్యధిక బావులు గల జిల్లాలు
నిజామాబాద్ : 1,15,431
నల్లగొండ : 1,07690
సిద్ధిపేట : 99,257
సూర్యాపేట : 87,207
జగిత్యాల : 79,650
అత్యల్ప బావులు జిల్లాలు
కుమరంభీం : 6,251
మేడ్చల్ : 6,782
ములుగు : 10,975
ఆదిలాబాద్ : 17,301
భద్రాద్రి : 18,129
గమనిక: బావులు అనగా ముఖ్యంగా రెండు రకాలు. అవి 1. డగ్ బావులు (సాధారణ బావులు), 2. ట్యూబ్ బావులు (బోర్లు)
బోర్లు మూడు రకాలు అవి. లోతులేని గొట్టపు బావులు, మధ్యస్థ గొ ట్టపు, లోతైన గొట్టపు బావులు.
సాధారణ బావులు (డగ్ వెల్స్)
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ బావులు సంఖ్య 4,57,625.
అత్యధికంగా సాధారణ బావులు గల జిల్లా కరీంనగర్ (60,711)
అత్యల్పంగా సాధారణ బావులు కలిగిన జిల్లా నారాయణపేట (38)
అత్యధిక డగ్‌వెల్స్ గల జిల్లాలు
కరీంనగర్ : 60,711
జిగిత్యాల : 56,127
మహబూబాబాద్ : 47,987
వరంగల్ : 45,859
పెద్దపల్లి : 36,378
అత్యల్ప డగ్‌వెల్స్ గల జిల్లాలు
నారాయణ పేట : 38
మేడ్చల్ మల్కాజ్‌గిరి : 49
మహబూబ్‌నగర్ : 68
మెదక్ : 366
ములుగు : 739
లోతులేని గొట్టపు బావులు

w రాష్ట్రంలో లోతులేని గొట్టపు బావుల సంఖ్య 73,295.
w అత్యధికంగా లోతులేని గొట్టపు బావులు గల జిల్లా సూర్యాపేట (18,040) అత్యల్పంగా లోతులేని గొట్టపు బావులు గల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి (175).
మధ్యస్థ గొట్టపు బావులు..
w తెలంగాణ రాష్ట్రంలో మధ్యస్థ గొట్టపు బావుల సంఖ్య 6,78,518.
w అత్యధికంగా మధ్యస్థ గొట్టపు బావులు గల జిల్లా నిజామాబాద్ (1,00,270)
w అత్యల్పంగా మధ్యస్థ గొట్టపు బావులు గల జిల్లా కరీంనరగ్ జిల్లా (874)
లోతైన గొట్టపు బావులు..
w తెంలగాణ రాష్ట్రంలో లోతైన గొట్టపు బావుల సంఖ్య 3,69,232.
w అత్యధికంగా లోతైన గొట్టపు బావులు గల జిల్లా సిద్ధిపేట (52,244)
w అత్యల్పంగా లోతైన గొట్టపు బావులు గల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ (486)
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు..
పూర్తయిన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు
w నాగార్జున సాగర్, శ్రీరామసాగర్ స్టేజి 1(పోచంపాడు), నిజాంసాగర్, ఆలిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఆరుగుల రాజారాం గుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ప్రియదర్శిని జూరాల, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, కడ్డం నారాయణ రెడ్డి, మూసి.
ఆన్ గోయింగ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు
w ఎలిమినేటి మాధవరెడ్డి (ఎస్‌ఎల్‌బిసి), శ్రీరామ సాగర్ స్టేజ్ 2, జె.పి.ఆర్ గోదావరి లిప్ట్, మహాత్మాగాంధీ కల్వకుర్తి , రాజీవ్ భీమా , జవహర్ నెట్టెంపాడు , పెద్దవాగు (శ్రీ కొమురం భీం) ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ , సింగూరు, శ్రీపాద ఎల్లంపల్లి, ఇందిరమ్మ ఎఫ్‌ఎఫ్‌సి ఫ్రమ్ ఎస్‌ఆర్‌ఎస్‌పి, సీతారామ, భక్తరామదాసు, బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, దిండి, లోవర్ పెనగంగ, పి.వి నరసింహారావు (కాంతనపల్లి), చనాఖా కొరాట బ్యారేజి, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తుమిళ్ల, లెండి ప్రాజెక్టు.
w 9 పూర్తి చేసిన మేజర్ ప్రాజెక్టుల ద్వారా 21.32 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను పూర్తి చేయడం జరిగింది.
w అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన శ్రీరామసాగర్ స్టేజ్ 1 ద్వారా 9.68 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను అందిస్తున్నారు.
w దీని తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా 6.40 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను అందిస్తున్నారు.

w రాష్ట్రంలో 24 ఆన్ గోయింగ్ మేజర్ ప్రాజెక్టుల ద్వారా 69.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
w ఇప్పటి వరకు 17.85 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌కు స్టాండ్ క్రియేట్ చేయడం జరిగింది.
w కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ ఆయకట్టు గురించి ప్రయత్నం జరుగుతుంది.
w 18.82 లక్షల స్టెబిలైజేషన్ చేస్తారు.
w తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆన్‌గోయింగ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం.
w ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పి 1,2 ద్వారా 13.20 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేయడం జరిగింది.
w 0.88 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ స్టాండ్‌ను క్రియేట్ చేయడం జరిగింది.
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు
పూర్తయిన మీడియం ప్రాజెక్టులు
w 3.04 లక్షల ఎకరాల ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ పొటెన్షియల్‌తో 27 ప్రాజెక్టులు ఉన్నాయి.
w ఆసిఫ్ నహర్, దిండి, నల్లవాగు, ఘన్‌పూర్ ఆనకట్ట, రామడుగు, పోచారం, కౌలాస్‌నాలా, సత్నాలా, స్వర్ణ, వట్టెవాగు, చెల్మెలవాగు (ఎన్‌టిఆర్ సాగర్), పి.పి రాపు (యర్రవాగు), అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, మల్లురువాగు, లక్నవరం లేక్, రామప్పలేక్, పాకాల లేక్, వైరా, లంకసాగర్, తలిపేరు, బయ్యారం చెరువు, గుండ్లవాగు, పెద్దవాగు, గడ్డెనవాగు (సుద్ధవాగు), కోటేపల్లి వాగు.
ఆన్‌గోయింగ్ మీడియం ప్రాజెక్టులు
w రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, కిన్నెరసాని, పాలెంవాగు, చైటుపల్లి హనుమంతరెడ్డి, పెద్దవాగు (నిల్వా యి), సదర్‌మట్ బ్యారేజ్, మోడికుంటవాగు, పెద్దవాగు జగన్నాధపూర్.
మైనర్ ఇరిగేషన్..
w తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ 46,531.
w మైనర్ ఇరిగేషన్ సోర్సస్‌లో చెరువులు, ఇతర రకాల చెరువులు ఉంటాయి.
w తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక చెరువులు గల జిల్లా సిద్ధిపేట (3,256).
w తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప చెరువులు గల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి (489)
అత్యధిక చెరువులు గల జిల్లాలు
సిద్ధిపేట : 3,256
మెదక్ : 3,054
సంగారెడ్డి : 2,918
భద్రాద్రి : 2,855
నల్లగొండ : 2367
అత్యల్ప చెరువులు జిల్లాలు
మేడ్చల్ : 489
కుమురంభీం : 576
గద్వాల : 589
ఆదిలాబాద్ : 649
రాజన్న సిరిసిల్ల : 666

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News