Monday, December 23, 2024

తెలంగాణ దేశానికే దిక్సూచి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: తెలంగాన రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలిచిందని, తొమ్మిదేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని డిఎస్‌ఆర్ జెండాలతండా, బురహాన్‌పురం, గిరిపురం, గుండెపుడి గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు రెడ్యానాయక్‌కు కోలాటాలు, నృత్యాలతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఎస్‌ఆర్ జెండాల తండా సర్పంచ్ భూక్య రమా రెడ్యానాయక్, గిరిపురం సర్పంచ్ పెద్దబోయిన జనార్ధన్, గుండెపుడి సర్పంచ్ నూకల కిషన్‌రెడ్డి, బురహాన్‌పురంలో మచ్చా వెంకటనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని అన్నారు.

దేశానికి దిశా నిర్ధేశం చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ ఒక్కడేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే బిఆర్‌ఎస్ ఎజెండా అని, సిఎం కెసిఆర్ వల్లే దేశానికి అన్నం పెట్టే స్ధాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. స్వరాష్ట్ర ఏర్పడ్డాక ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ న్యాయం చేశారని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బిఆర్‌ఎస్ పార్టీకి, మాకే ఉందన్నారు. డోర్నకల్ నియోజకవర్గం తనకు దేవాలయమని అందులోని ప్రజలందరూ నాకు దేవుళ్లతో సమానమని, గుడిలో పూజారి ఏవిధంగా పూజ చేస్తాడో అదే విధంగా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటానని తెలిపారు. సిఎం కెసిఆర్ పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందించడంతోనే రైతులు పుష్కలంగా పంటలు పండిస్తూ తెలంగాణకే అన్నపూర్ణగా నిలిపారని తెలిపారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్ధాయిలో తీర్చిదిద్దామన్నారు. తండా తండాకు తారురోడ్లు, డబుల్ రోడ్లు వేశామన్నారు. కెసిఆర్ పాలనలో ఆసరా, రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, సకాలంలో ఎరువులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయన్నారు. నాటి నేటి పరిస్ధితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని, ప్రజలు అభివృద్ధిని గమనించాలని తెలిపారు. పేదల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారని, సిఎం కెసిఆర్‌ను గుండెల్లో పెట్టుకొని మూడో సారి బిఆర్‌ఎస్ ప్రభుత్వాని గెలిపించాలన్నారు. ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాలు అయ్యాయని అప్పటి నుండి రానివారు ఇప్పడు గ్రామాలలోకి వస్తున్నారని, బయటి నుంచి వచ్చే వ్యక్తులను నమ్మవద్దని, బురదలో రాయి వేసి దాటిపోతారే తప్ప శుభ్రం చేయరని అలాంటి వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్‌రావు, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం, రైతు సమన్వయ కోర్డినేటర్ పివిఆర్‌ఎన్ శాస్త్రీ, ఎంపిటిసిలు మచ్చా ఉమా భాస్కర్, గుగులోతు రమేష్, పులుసు రంజిత చిరంజీవి, గిరిపురం ఉప సర్పంచ్ సుమలత సురేష్, గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, రావుల వెంకట్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, భూక్య రెడ్యానాయక్, కేలోతు శంకర్, రాంమూర్తి, పట్ల మల్లయ్య, శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News