Wednesday, November 6, 2024

వైద్యం, ఆరోగ్యంలో అగ్రగామిగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • పేదలకు అందుబాటులో వైద్య సేవలు: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు వైద్య, ఆరోగ్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలించిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైద్యా ఆరోగ్య ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 9 ఏండ్ల పాలనలో వైద్య, ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధ్ది చెందిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్చులు వచ్చాయన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్ధాయి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గిల్లో 50 పడకల ఆసుపత్రుల నిర్మాణంతో పాటు పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కీడ్ని రోగులకు డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎమ్‌లు అందిస్తున్న సేవలకు ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యంగా కరోనాలో వారు అందించిన సేవలను గుర్తుచేసుకుని ప్రశంసించారు.

గర్భిణి, బాలింతలకు పౌష్టికాహారం కిట్లతోపాటు కేసీఆర్ కిట్‌లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పుట్టబోయే, పుట్టిన బిడ్డలకు కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే సమకూర్చడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన డాక్టర్లు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎమ్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి కృష్ణన్, ఎఎమ్‌సీ చైర్మన్ సేజాత, వైస్ చైర్మన్లు వాణీశ్రీ, ఉషారాణి, పీఏసీఎస్ చెర్మెన్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, శివకుమార్, కౌన్సిలర్ మధుసూదన్‌రావులతోపాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News