Wednesday, January 22, 2025

అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

సారంగాపూర్: మండలంలోని పోతారం గ్రామంలో కోటి 80 లక్షలతో నిర్మించిన 20 రెండు పడకల గదుల గృహ సముదాయా న్ని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోతారం గ్రామానికి ఇప్పటి వరకు రూ.20 కోట్ల నిధులు అభివృద్ధి సంక్షేమ పథకాలకు మంజూరయ్యాయని అన్నారు. అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

గ్రామంలో 8 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. 86 మందికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.80 లక్షలు అందించడం జరుగుతోందన్నారు. 63 మంది గొల్ల, కురుమలకు గొర్ల యూనిట్లు మంజూరయ్యాయిన, 60 లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ అధికారుల జీతాలు పారదర్శకంగా ఇండ్ల మంజూరు జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కోల జమున శ్రీనివాస్, జడ్‌పిటిసి మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ ఢిల్లీ రామారావు, ఎంపిటిసి సుధాకర్‌రావు, పిఎసిఎస్ చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మదన్, నాయకులు ప్రేమానందం, లకా్ష్మరెడ్డి, మాజీ ఎంపిటిసిలు మల్యాల జలపతి, సాయిలు, కోల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ విజయరంగారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News