Thursday, January 23, 2025

మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా: మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తెలంగాణ హరితోత్సవం నిర్వహించారు.

మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అధికారులు, విద్యార్ధులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హరితహారం కేసీఆర్ మానస పుత్రిక అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే సదుద్దేశంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. మొక్కల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం మందంజలో ఉందని మంత్రి చెప్పారు.

హరితహారంలో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. హరితహారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం వెళ్లివిరుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమై రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ కోట్లాది మొక్కలు నాటడం ద్వారా హరితహారం ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించిందని అన్నారు.

కలెక్టర్ అయోయ్ కుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలలో ఏర్పాటు చేసిన నర్సరీలు, ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News