Saturday, November 23, 2024

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
  • పేద ప్రజల పాలిట దేవుడు సిఎం కెసిఆర్
    *  పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాముల
    నాగర్‌కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వ పాలనలో, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స భ్యులు పోతుగంటి రాములు కొనియాడారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పో తుగంటి రాములు హాజరయ్యారు. ఎంపి నిధులతో పది మంది దివ్యాంగులకు 7లక్షల 92 వేల రూపాయలతో ద్విచక్ర వాహనాలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి, జిల్లా ఎస్పి కె. మనోహర్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి ఎంపి రాము లు దివ్యాంగులకు పంపిణీ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దళితుల ఆత్మగౌరవాన్ని కెసిఆర్ పెంచారని, పేద ప్రజ ల పాలిట దేవుడు కెసిఆర్ అని అన్నారు. దేశంలో పార్లమెంట్ రాజ్యసభల్లో 900కు పైగా ఎంపిలు ఉన్నారని, ప్రతి ఎంపికి 5 కోట్ల రూపాయల ఎంపి నిధులు ఉంటాయన్నారు. దేశంలో ఏ ఎంపి కూడా దివ్యాంగులకు వాహనాలను అందించలేదని,ప్రథమంగా తాను మాత్రమే ఎంపి నిధులతో నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రతి సంవత్సరం పది లక్షల రూ పాయలను దివ్యాంగులకు ఖర్చు చేస్తున్నట్లు ఆ యన తెలిపారు.
  • వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహేష్‌కు కృతిమ కాలు ఏర్పాటు చేసేందుకు 3 లక్షల 50 వేల రూపాయల నిధులు విడుదలకు ప్రొసీడింగ్‌ను అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ఆసరా పెన్షన్లను తెలంగాణలో అత్యధికంగా అందజేస్తున్నారని, నాగర్‌కర్నూల్ జిల్లాలోని లక్షా 12 వేల 588 మందికి ప్రతి నెలకు 24 కోట్ల 2 లక్షల 17 వేల 408 రూపాయ ల ఆసరా పెన్షన్లను పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటింటా సంక్షేమ తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది, బతుకులు ఆగమైపోతాయి, ఇది ఒక సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా కానీ, తొమ్మిదేండ్ల రాష్ట్రాన్ని చూస్తే సకల జనుల్లో సం తోషం వెల్లివిరుస్తుందన్నారు. సిఎం కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ సర్కార్ సబ్బండ వర్గాలకు అ ండగా నిలుస్తుందన్నారు. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రా న్ని చూస్తే సకల జనుల్లో సంతోషం, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధిని కండ్ల ముందే చూ పిస్తూ, కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తుందన్నారు. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, రజకులు, నాయిబ్రాహ్మణులు, లాండ్రీ షాపులు, సె లూన్లకు విద్యుత్ రాయితీ, పేద విద్యార్థులు విదేశీ చదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్, అసహాయులకు ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి, కెసిఆర్ కిట్లతో పేదలకు అండగా నిలుస్తూనే గ్రామీ ణ కులవృత్తులకు జీవం పోస్తుందన్నారు. దళిత బంధుతో దళితుల దశాబ్దాల వెనుకబాటుతనాన్ని దూరం చేస్తూనే వ్యవసాయ రంగ చరిత్రలోనే నిలిచిపోయే రైతు బంధు పథకం రైతుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆగం కాకుడా రైతు బీమాను అమ లు చేస్తుందన్నారు. ఇంకా విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలకు సమప్రాధాన్యమిస్తూ, తొమ్మిదేళ్లలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. అదే విధం గా జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ శాంత కుమారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో సాధి ంచిన ప్రగతి ఫలాలకు మహిళలందరు రుణపడి ఉండాలన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఇంటి అవసరాలకు నీళ్ల బిందెలతో గ్రామ పొలిమేరల్లో బోర్ల నుంచి నీళ్లు పట్టుకొచ్చే వాళ్లని, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలోని ప్రతి ఇంటికి కృష్ణ నీటితో మిషన్ భగీరథ నల్లాలతో జలాలు అందిస్తున్న ప్రభుత్వానికి ఆడపడుచుల తరపున ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ఘనంగా నిర్వహించి 9 ఏళ్లలో సా ధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతుందని ఆమె అన్నారు. అంతకు ముందు నాగర్‌కర్నూ ల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి నూతన కలెక్టరేట్ వరకు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన 33 మంది లబ్ధిదారుల ట్రాక్టర్లతో జిల్లా షెడ్యుల్డ్ కులాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ దినోత్సవం సంబరాల్లో మహిళలు బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై గేయ రూపంలో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమశాఖ అధికారిని వెంకటలక్ష్మి,షె డ్యు ల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి రా మ్ లాల్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, అదనపు డిఆర్‌డిఓ లక్ష్మి నారాయణ,డిపిఎం అరుణాదేవి, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, ప్రజలున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News