Monday, December 23, 2024

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

కడ్తాల్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవాల దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని ఆయన పేర్కొన్నారు. శనివారం కడ్తాల రైతు వేదిక భవనంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వ హించారు.

కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై ఎంపిపి దేపావత్ కమ్లీ మోత్యానాయక్, జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్త, వైస్ ఎంపిపి బావండ్ల పల్లి ఆనంద్, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మా రెడ్డి, ఉప సర్పంచ్ కడారి రామకృష్ణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడారు.

తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవి అని, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవని స్పష్టం చేసారు. నకిలీ విత్తనాలు లేవు, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తున్నామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు కొరత లేనేలేదని, కరెంటు సమస్యలు కూడా లేవన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుందామని భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. వరి సాగులో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు.

రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రైతులు లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితీ అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపిడిఓ కె.రామకృష్ణ, తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్‌లు రమావత్ తులసీరాం నాయక్, బాగ్యమ్మ, సేవ్య, ఎంపిటీసి లచ్చీరాం నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సేవ్య నాయక్, నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డి, మంగళపల్లి నర్సింహ్మ, భిక్షపతి, చందోజీ, వివిధ గ్రామాల రైతులు. వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News