*మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ : చిన్న తరహా, పెద్ద తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శిల్పారామంలో పారిశ్రామిక ప్రగతి అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఒకప్పుడు నిరుద్యోగులు చుదువుకున్నా కొలువు రాక వలసలు పోయే వారని, ఏవో చిన్న చిన్న ఉద్యోగాలతో కాలం గడిపేవారన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఐటి కారిడార్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటికే అమర రాజా వంటి పెద్ద కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ బ్యాటరీ పరిశ్రమనే ఏర్పాటు చేయబోతోందన్నారు. ఇందులో 3 వేల మందికి పైగా ఉద్యోగాలు స్థానికులకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా అనేక పెద్ద కంపెనీలు రాబోతున్నట్లు తెలిపారు.
ఐటి రంగంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. వేలాది మందికి ఐటి రంగం ఉపాధి కల్పించిందన్నారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత స్పష్టమైన గుణాత్మక మార్పు వచ్చిన విషయా న్ని గమనించాలని కోరారు. రైతులకు, పేద వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆర్థ్దికంగా బలోపేతం చేసినట్లు చెప్పారు. అనంతరం శిల్పారామంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవినాయక్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.,