Monday, December 23, 2024

గ్రామ పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  •  ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పూడూరు: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మహేశన్న పల్లెబాట కార్యక్రమం చివరి నాలుగోవ రోజు బుధవారం పూడూరు మండల పరిధిలోని తిమ్మాపూర్, కొత్తపల్లి, బాకాపూర్, గొంగుపల్లి, ఎన్కెపల్లి, మన్నెగూడ, మీర్జాపూర్, కండ్లపల్లి గ్రామ పంచాయతీలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సీమలను అన్ని విధాలుగా అభివృద్ధిలో తీసుకవెళ్లేందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ కంకణ బద్దులయ్యారని అన్నారు.

గ్రామాభివృద్ధే ధేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. అనంతరం తిమ్మాపూర్ సర్పంచ్ రామస్వామికి బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి మల్లేశం, జడ్‌పిటిసి మేఘమాల, ఎండీ. అజీమోద్దీన్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఎండీ.అజారోద్దీన్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ఎంపిటిసి అహ్మద్ ఆదీల్, బాలమణి, సర్పంచ్‌లు రామస్వామి, రామయ్య, కుల్స్‌ంభీ, వనజ, వినోద్‌గౌడ్, రాకంచర్ల దేవాయలం ఛైర్మన్ నర్సింహ్మా, సీనియర్ నాయకులు జాహేద్, దయానంద్, పాండు, బాల్‌యాదవు, సాబేర్, మాణిఖ్యం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News