Monday, January 20, 2025

క్రీడారంగానికి సముచిత స్థానం కల్పించిన తెలంగాణ రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కెసిఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యాక ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోని యువత కోసం క్రీడలకు సముచిత స్థానాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా హన్మకొండ లోని జెఎన్‌ఎస్ స్టేడియంలో వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 37 ఎడిషన్ ఒలంపిక్ డే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరైయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి క్రీడాకారులందరికీ అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవ శుక్రవారం తెలిపారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం లను ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ కే దక్కిందన్నారు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జెఎన్‌ఎస్ స్టేడియంను ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ 37 ఎడిషన్ ఒలంపిక్ డే రన్‌లో పాల్గొన్న క్రీడాకారులను అభినందిస్తున్నానని అన్నారు. క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ క్రీడలను క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని అన్నారు.

కార్యక్రమానంతరం నేడు అంతర్జాతీయ హ్యాండ్ బాల్ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చెర్మెన్ సంఘంరెడ్డి సుంధర్ రాజ్ యాదవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.డి అజీజ్ ఖాన్, రిటైడ్ ఐపిఎస్ నాగరాజు, వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News