Tuesday, November 5, 2024

భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

చేర్యాల: గత ప్రభుత్వాల హయాంలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రం ఉండేదని, నేడు సిఎం కెసిఆర్ పరిపాలనలో భారతదేశానికి సైతం అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం కడవేర్గు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆర్‌అండ్‌బి నిధులతో రూ. 2కోట్ల 72 లక్షలతో నిర్మించే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకనాడు గట్టిగా వర్షం పడితే చెరువులు తెగి ఊర్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉండేదని, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు నిర్మించుకున్నామని గుర్తు చేశారు. ప్రతి పక్షాలకు చెంపపెట్టులాగా కెసిఆర్ పరిపాలన కొనసాగుతుందని కడవేర్గు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉండాల్సిందని, గత ప్రభుత్వాల చేతగానితనంతో నేడు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఈబ్రిడ్జి నిర్మాణం కోరకు ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూశారని సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవతో బ్రిడ్జి నిర్మాణం కోసం కావాల్సిన నిధులు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రుల నుంచి మొదలు కొని వార్డు మెంబర్ల దాక చెరువుల వద్ద కుంటల వద్ద ఉంటూ ఎలాంటి నష్టం జరగకుండా చూడడం జరిగిందని తెలిపారు.

బిఆర్‌స్‌లో పలువురి చేరికలు

పార్టీలకు చెందిన నాయకులు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News