Wednesday, January 22, 2025

మహిళా సాధికారతలో తెలంగాణ ముందడుగు

- Advertisement -
- Advertisement -
  • సంక్షేమంలో సింహభాగం మహిళలదే
  • మహిళా సంక్షేమానికి విప్లవాత్మక పథకాలు
  • మహిళ రక్షణకు ప్రత్యేక షీటీం
  • స్వయం సహాయక గ్రూపులకు 7 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: మహిళ సాధికారతలో తెలంగాణ ముందడుగులో నిలుస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణంలోని టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో నియోజకవర్గస్థాయి మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించగా హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మహిళలు బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని విప్లవాత్మక పథకాలను సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు.

రాష్ట్ర సంక్షేమంలో మహిళల సింహ భాగంగా నిలుస్తుందని అన్నారు. అంది వర్గాల మహిళలకు సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నదే సిఎం కెసిఆర్ ఉద్దేశం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత తొమ్మిది ఏళ్లుగా కెసిఆర్ కిట్టు ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం అయినా కుటుంబానికి చేరాలంటే ఆ కుటుంబ మహిళ పేరుమీదనే అందిస్తుందని అన్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ప్రతినెల 13 వేల 650 రూపాయలు, ఆశ కార్యకర్తలకు 9 వేల 750 రూపాయల పారితోషకం అందివ్వడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహలక్ష్మి, అమ్మ ఒడి వాహనాలు, మహిళల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య లక్ష్మి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. గర్భిణీలలో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా మహిళలకు సివిల్ పోలీస్ ఉద్యోగ నియమాగాల్లో 33 శాతం, ఆర్మీ రిజర్వ్ పోలీస్ నియమాగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు వెల్లడించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సంకల్పంతో అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం వీ – హబ్ ఏర్పాటు, మహిళల భద్రతకు ప్రత్యేక షీటీములు, భరోసా, సఖి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, చైల్ కేర్ సెలవులు పెంచడం జరిగిందని అన్నారు.మహిళల సురక్షణ, సాధికారత, సాలంబన, సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్ పనిచేస్తుందని అన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా ఉద్యోగినులను, పలు విభాగాలలో ప్రతిభ చూపిన మహిళలను ఘనంగా సన్మానించారు. స్వయం సహాయక గ్రూపులకు సుమారు 7 కోట్ల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అని త, ఎంపిపిలు లకావత్ మానస, లక్ష్మీ బిల్ నాయక్, కొక్కుల కీర్తి, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజ ని, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, సైదాపూర్ మ ండల వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, పలు మండలాల బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు, మెప్మా సభ్యులు, మహిళా గ్రూప్ సభ్యులు, పెద్దఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News