Sunday, January 19, 2025

హెల్త్‌కేర్‌లో దూసుకుపోతున్న తెలంగాణ : కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హెల్త్ కేర్‌లో తెలంగాణ దూసుకుపోతోంది. వివిధ ఆరోగ్య సూచీలలో రాష్ట్రం అనూహ్యంగా మంచి పనితీరు కనబరిచిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా అన్నారు. 2014లో 11వ స్థానం నుండి 2023లో 3వ స్థానానికి చేరుకోవడం ద్వారా దేశంలోనే ఆరోగ్య సంరక్షణలో మూడవ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని వెల్లడించారు. ర్యాంకింగ్‌లో కనిపించే మెరుగుదల ఇందుకు నిదర్శనమని, గత 9 + సంవత్సరాల్లో వైద్య సదుపాయాలలో మార్పు సాధించిందని తెలిపారు.

ఆరోగ్య సంరక్షణను పునర్నిర్వచించడం, వైద్య విద్యను విప్లవాత్మకంగా మార్చడం ఆరోగ్య తెలంగాణ మార్గమన్నారు. ‘రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలలో ఒకటి. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పునరుద్ధరించడం, అత్యాధు నిక వైద్య మౌలిక సదుపాయాలను జోడించడం, వినూత్న కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టడంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక రాష్ట్రాల్లో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు నాసి రకంగా ఉండగా, తెలంగాణాలో ప్రభుత్వ ఆధీనంలోని వైద్య సదుపాయాలు అభివృద్ధి చెందుతూ ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తున్నాయ’ని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News