Tuesday, November 5, 2024

పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పరిశ్రమ రంగం ముందుకు దూసుకుపోతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి గ్రామంలోని పారిశ్రామికవాడలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక జడ్పిటిసి పట్నం అవినాష్‌రెడ్డి, ఎంపిపి కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, హైతాబాద్ సర్పంచ్ మల్లేష్‌లతో కలిసి పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్‌ఐపాస్ అందుబాటులోకి తేవడంతో అనుమతుల ప్రక్రియ సులభతరమైందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతున్నట్లు గుర్తు చేశారు. టీఎస్‌ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ 8,02,1708 కోట్ల పెట్టుబడితో 1715 యూనిట్లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా 9,75,979 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడయన్నారు.

టీఐడియా పథకం క్రింద 02-062014 నుంచి 31032023 వరకు జిల్లాలో 2140 అఫ్లికేషన్లకు గానూ రూ 42,468 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఐటి రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుందని, ఈ రంగంలో మన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితోనే ఎంతో పురోగతి సాధించామన్నారు. 2013-, 14 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ 57,258 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ రెండు లక్షల 41 వేయి 275 రూపాయలు కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నట్లు తెలిపారు.

గత సంవత్సరం రూ 183569 కోట్ల ఎగుమతులతో పొలిస్తే 57706 కోట్ల పెరుగుదల సాధించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 323396 వేల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 905715 వేల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ సైదులుగౌడ్, ఎంపిడిఒ అనురాధ, పరిశ్రమలకు సంబంధించిక అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News