Monday, December 23, 2024

వైద్య రంగంలోనూ తెలంగాణ అగ్రగామి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీరయ్య సత్తుపల్లిలో నిర్మితమవుతున్న 100 పడకల ప్రభుత్వ హాస్పటల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంచారు.

అనంతరం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్, టెక్నీషియన్ సహా ఉత్తమ డాక్టర్లను సన్మానించి, పురస్కారాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ల, కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల, కెసిఆర్ కిట్ లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వనప్పటికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపిపి దొడ్డా హైమావతీ శంకరరావు, పెనుబల్లి ఎంపిపి లక్కినేని అలేఖ్య, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News