Monday, December 23, 2024

మహిళల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • మహిళ శిశు సంక్షేమానికి విప్లవాత్మక పథకాలు
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి: మహిళ సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, మహిళల భధ్రత కోసం తెలంగాణలో షీటీమ్స్ తీసుకు వచ్చారని, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వచ్చిందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళ సంక్షేమ దినోత్సవాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కొండంత అండగా సిఎం కెసిఆర్ నిలుస్తున్నారన్నారు. పుట్టిన ఆడబిడ్డ నుంచి 60ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంక్షేమానికి కెసిఆర్ కిట్,పెన్షన్‌లు అందించి బిఆర్‌ఎస్ తోడ్పాటు నందిస్తుందన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీసు వ్యవస్థ, మహిళ భధ్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళలు సంతోషంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుందని సిఎం కెసిఆర్ నమ్ముతారన్నారు. మాతా శిశు సంక్షేమానికి విప్లవత్మాక పథకాలు తీసుకు వచ్చారన్నారు. మాతా శిశు మరణాలను తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. మహిళలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. 9 ఏళ్లకు ముందు మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏవిధంగా ఉందనేది రాష్ట్ర మహిళలే గ్రహించుకోవలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలను బలోపేతం కోసం ప్రబుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు.

గత ప్రభుత్వాలు మహిళ సంక్షేమానికి చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, డిఆర్‌ఓ నగేష్, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి,వైస్ చైర్మన్‌లత విజేందర్‌రెడ్డి, సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి, జడ్‌పిటిసి సునీత మనోహర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, పద్మావతి పాండురంగం, సిడిపిఓ రేణుక, తహశీల్దార్‌లు విజయ్‌కుమార్, మనోహర్ చక్రవర్తి, బిఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, విఠల్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News