రాజ్‌భవన్ నూతన సంవత్సర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఇతర రా ష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందంటూ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసలు కు రిపించారు. రాజ్‌భవన్‌లో శని వారం జరిగిన నూతన సంవ త్సర వేడుకల్లో పాల్గొన్న ఆమె కేక్ కట్ చేశారు. తెలంగాణ రా ష్ట్ర, దేశ ప్రజలకు నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ప్రజల, సూచనలు, సమ స్యల గురించి తెలిపేందుకు రా జ్‌భవన్‌లో డ్రాప్‌బాక్స్ సేవలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 20 మంది పేద విద్యార్థులకు ఎన్జీవో సాయంతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. వారిలో 7 గురు దివ్యాంగులు, 13 మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థు లు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరంతో పాటు మాస్క్‌ను ధరించాలని సూచించారు. ఇ క, ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవా లన్నారు.
తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్పి అభినం దించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన సందేశమన్నారు. ఒ మిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరి సహకారంతో కరోనా మాదిరి ఈ మహ మ్మారిని కూడా ఎదుర్కోగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక డ్రాప్ బాక్స్‌ల సేవల గురించి ప్రస్తావిస్తూ సలహాలు, సమస్యలు బాక్స్‌లో వేయవచ్చు అని సూచించారు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినాప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా రాజ్‌భవన్ ఉంటుందని స్పష్టం చేశారు.