Thursday, January 23, 2025

దేశానికి తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

లక్షెట్టిపేట : దేశానికే తెలంగాణ ఆదర్శమని స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు వేధికలో నాయకులతో కలిసి లబ్దిదారులకు కళ్యాణల, షాదీముభారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్దిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

నియోజకవర్గ పరిధిలో ఏడాదికి సుమా రు రూ. 9 కోట్ల చొప్పున లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్దిక సహాయం అందజేస్తుందని ఆయన వివరించారు. అంతే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 18 కోట్లు బాధితులకు అందజేసి అండగా నిలిచిందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ది చేకూరుతుందన్నారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని గుర్తించి ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కోరారు. అనంతరం 41 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ అన్నం మంగ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, కో ఆప్షన్ షాహిద్ ఆలీ, డీటీ సనత్, ఆర్‌ఐ సంజీవ్, నాయకులు అంకతి గంగాధర్, మెట్టు రాజు, బాకం లచ్చన్న, కొత్తూరు సర్పంచ్ సొల్లు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News