Monday, December 23, 2024

వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయి..

- Advertisement -
- Advertisement -
దేశం మొత్తం ఎంబిబిఎస్ సీట్లలో43 శాతం మనవే
ట్విట్టర్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ మెడికల్ కాలేజీలు పెరిగాయి. దీంతో ఎంబిబిఎస్ సీట్ల పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అందుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిధిలో 2023 -24 విద్యా సంవత్సరానికిగానూ దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో 43 శాతం సీట్లు తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చినవే అని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన 2,118 ఎంబిబిఎస్ సీట్లలో 900 సీట్లు తెలంగాణ నుండి వచ్చినవే అని తెలిపారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను ప్రజలకు మరింత చేరువ చేసి ఆరోగ్య తెలంగాణ సాకారం చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిగతా మెడికల్ కాలేజీలకు అనుమతులు వస్తే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News