Thursday, January 23, 2025

అభివృద్ధిలో తెలంగాణ ముందంజ

- Advertisement -
- Advertisement -

ప్రశంసలు గుప్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఎపి నుంచి కంపెనీలన్ని వెనక్కి పోతున్నాయని ఆగ్రహం
ఎపి సిఎం జగన్ పనితీరుపై అసంతృప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి భారీగా పెట్టుబడుదారులు తరలివస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల అధికారులు కితాబునిచ్చిన నేపథ్యంలో నారా లోకేశ్ కూడా కెసిఆర్ చేపట్టిన పలు అంశాలను ప్రశంసించడంపై టిడిపి పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం లోకేశ్ మాట్లాడిన మాటల నేపథ్యంలో ఎపిలో నెలకొన్న పరిస్థితులు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదివారం ఎపిలోని రావెలలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ ఎపిలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, దాడుల వార్తలే కనిపిస్తుండగా తెలంగాణలో మాత్రం నిత్యం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలే కనిపిస్తాయన్నారు. ఎపికి వచ్చే పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య జగన్ చిచ్చు పెడుతుంటే హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.100 కోట్లకు పోతుందని ఈ ధరను కులం పెంచిందా? కర్ణాటకకు ఫాక్స్‌కాన్ మతం తీసుకెళ్లిందా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News