Monday, December 23, 2024

అన్నిరంగాల్లో ఆగ్రస్థానం తెలంగాణనే

- Advertisement -
- Advertisement -
  • ప్రజా సంక్షేమ పాలనకు ప్రతి రూపం బిఆర్‌ఎస్
  • నిర్విరామంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్
  • తాగునీటి గోస తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే
  • బిఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
  • రామాయంపేట మరింత అభివృద్ధి చేస్తాం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తా
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: అన్నిరంగాల్లో ఆగ్రస్థానం మన తెలంగాణనే అని రాష్ట్ర ఆర్థిక , వైద్యా రోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రబాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో మెదక్, సంగారెడ్డి నియోజక వర్గాల నుంచి భారీగా బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం దుర్బిక్షంగా ఉండే నేడు సిఎం కెసిఆర్ నేతృత్వంలో స్వపరిపాలనలో సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు. నాటి కాంగ్రెస్, టిడిపి పాలనలో 200 ఉన్న పింఛన్ నేడు రూ.2 వేలు పింఛన్ ఇచ్చి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు.

వికలాంగుల పెన్షన్ 3 వేల నుంచి 4 వేల పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి, కాన్పు అయితే కెసిఆర్ కిట్టు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంతో బిడ్డల తాగునీటి కష్టాలను తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. నీళ్ల కోసం కిలో మీటర్లు నడిచే బాధ తప్పందన్నారు. మండెటెండల్లో కూడా క్రమం తప్పకుండా మంచినీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. రామాయంపేట అభివృద్ధి దశల వారిగా చేసుకుందామన్నారు. రోడ్లు, మురికి కాలువలకు నిధులు కావాలని ఎమ్మెల్యే కోరారు. రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. రామాయంపేట అభివృద్ధి మరింత చేసుకుందాం ఆదర్శంగా నిలుద్దామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ఆటంకం లేకుండా నిర్వహించామన్నారు. మెదక్ నియోజక వర్గం రామాయంపేట అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మీ మధ్యలో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి పద్మా దేవేందర్‌ను ఆశీర్వదించాలని కోరారు.

బిఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

రామాయంపేట ఇద్దురు మున్సిపల్ కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్‌లతో సహా పలువురు కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. రామాయంపేట కోమటి పల్లి 2వ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్ బిజెపికి గుడ్ బై చెప్పారు. 1వ వార్డు కౌన్సిలర్ ఓద్దె స్వామి నేతృత్వంలో కాంగ్రెస్ బిజెపికి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో దాదాపుగా 200 మంది బిఆర్‌ఎస్‌లో చేరారు. సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ గిర్మాపూర్ గ్రామ కాంగ్రెస్‌కి చెందిన మాజీ సర్పంచ్‌లు ప్రస్తుత ఉప సర్పంచ్‌లు బిఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన వారిలో ఆమర్‌సింగ్, రవిందర్ సింగ్, గణేశ్, సిద్దిరాములు, గావు వివేకానంద, ఆశోక్, యాదగిరి, రాజు, బైరం ఆశోక్, శ్రీనివాస్, బాబు , ప్రశాంత్, పటోల్ల జయరాములు, సోల్కంపల్లి కృష్ణ, ఆంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, మన్నె మల్లేశం, దుర్గయ్య, సంయుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News