Saturday, November 23, 2024

విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

కొణిజర్ల : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్తు ప్రగతి సంబురాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు దశాబ్దాల కాలం పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను పరిశీలించి వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి పెంపుదలకు కృషి చేశారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంపు వల్ల రాష్ట్రానికి విద్యుత్ కొరత లేకుండా పోయిందని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బిఆర్‌ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండటం వలన ఇతర దేశాల పారిశ్రామికవేత్తలు సైతం పరిశ్రమలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటలు విద్యుత్తు రంగంలో సేవలు అందిస్తున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News