- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్: బిఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని గొర్లవీడు గ్రామంలో రూ.22.5లక్షలతో గొర్లవీడు నుండి పాసిరెడ్డి వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు, నాలుగు కోట్లతో గొర్లవీరు నుండి నాచారం వరకు బిటి రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన చేశారు.
పిహెచ్‌సిలో రూ.8లక్షలతో నిర్మించిన అదనపు పేషన్డ్ షెడ్‌ను ప్రారంభించారు. రూ.4.95 లక్షలతో మున్నూరు కాపు కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మిట్టపల్లి సురేందర్ రాసిన పాటల సిడిని ఆవిష్కరించారు.అనంతరం ఎంఎల్‌ఏ మాట్లాడుతూ గొర్లవీడు గ్రామ ప్రజల ఆశీస్సులు నాకు ప్రతి ఎన్నికకు అండగా ఉన్నాయన్నారు. ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా, విజయవంతంగా గొర్లవీడు గ్రామానికి అభివృద్ధి పనులు చేసిన, తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉన్న కరెంట్ వస్తే ఒక వార్త, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ పోతే వార్తయ్యిందన్నారు.
గొర్లవీరు గ్రామంలో ఒకే రోజు దాదాపు రూ.6కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో 24గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు రైతును అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ అన్నారు. గతంలో భూమి శిస్తు చేసిన తరుణం లేదని, భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకొని గొప్ప నిర్ణయం రైతు బంధు పథకమన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న, అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా ముందుకు సాగిన ప్రభుత్వం తెలంగాణ అని, ఎవరు అడగకుండానే 3వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ పెంచి 4016 ఇస్తున్నారని, ప్రజా సంక్షేమ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అడగలేదు కానీ అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
గతంలో ముఖ్యమంత్రి విడతల వారిగా రుణమాఫి చేస్తామని చెప్పారని, ఒక్కొ దశలో చేసుకుంటు ఇప్పుడు దాదాపు 19వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వమన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంఎల్‌ఏ ప్రత్యేక నిధులు నుండి రూ.15లక్షలు మంజూరు చేశారు. తమ గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించినందుకు గాను గ్రామ ప్రజలు పాలకవర్గం వివిధ కులాల నాయకులు ఎంఎల్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.