Thursday, January 23, 2025

రాయితీలిస్తాం… రండి

- Advertisement -
- Advertisement -

వంటనూనెల ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం 10వేల ఎకరాల్లో ఆహార శుద్ధి
పరిశ్రమలు పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కెటిఆర్ పిలుపు

 

మన తెలంగాణ/హైదరాబాద్: సమీప కాలంలోనే తెలంగాణ వంటనూనె ఉత్పత్తుల రాష్ట్రంగా ఎదగనుందని రాష్ట్ర పరిశ్రమలు ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ వె ల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ కేం ద్రంగా ఐటిసి కోహినూర్‌లో ఐవిపిఎ ఆధ్వర్యంలో వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్స్ రం గంపై నిర్వహించిన గ్లోబల్ రౌండ్ టేబుల్ 2022 సదస్సులో మంత్రి కేటిఆర్ ము ఖ్య పాల్గొన్నారు. వ్యవసాయ ఉ ద్యాన శాఖల నిరంజన్‌రెడ్డి కూడా పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి కేటిర్ మాట్లాడుతూ పామాయిల్, వేరుశనగ, సో యాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటల సాగుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

రై తులు వరికి ప్రత్యామ్నాయంగా నూనెగింజల సాగువైపు మొగ్గుచూపే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అదిలాబాద్, అసిఫాబా ద్, నిర్మల్ జిల్లాల్లో సోయాబీన్ అధికంగా సాగు చేస్తున్నారని, వనపర్తి, గద్వాల, మ హబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్ జిల్లాల్లో వేరుశనగ అధికంగా సా గువుత్నుట్టు తెలిపారు. ఆగ్రో సంస్థలు, ప్ర తినిధులు ఈ అవకాశాలు గమనించి తె లంగాణ వైపు మొగ్గు చూపాలన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు క ల్పిస్తుందని, ఆహారశుద్ధ్ది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. తె లంగాణ రాష్ట్రంలో ఫుడ్ జోన్‌కోసం 10వేల ఎకరాల భూమిని కేటాయించామని వెల్లడించారు. పరిశ్రమలు పె ట్టేవారితో పనిచేసేందుకు సంతోషంగా ఉందన్నారు.

సింగిల్ విండో విధానం అ మలు చేస్తున్నామన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి 15రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని , ఆ గడువు దాటితే అధికారులకు జరిమానా వేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో ప్రత్యేక ప్రణాళికలతో ముం దుకు సాగుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో వంటనూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు రావాలని వి జ్ఞప్తి చేశారు. అవసరమైన రాయితీలు కూ డా కల్పిస్తున్నట్టు వివరించారు. వంటనూనెల పరిశ్రమలకు అవసరమైన ముడిసరు కు కూడా అందుబాటులో ఉంటుందన్నా రు.

దేశీయంగా  నూనెగింజల ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా నూనెల దిగుమతులు తగ్గించుకోవచ్చన్నారు. దేశ అవసరాలకోసం 60శాతం నూనెలు ఇతర దేశాలనుంచే దిగుమతి అవుతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయశాఖ నేతృత్వంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రైతులను వరిసాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు కృషి జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్‌లైన్ రంగంలో పురోగమిస్తోందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News