Sunday, December 22, 2024

కెసిఆర్ చెప్పారు… చేసి చూపిస్తారు

- Advertisement -
- Advertisement -

Telangana is developing under leadership of KCR:KTR

20-01లో జరిగింది ఇప్పుడు మళ్లీ జరిగి తీరుతుంది : కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో దూసుకువెడుతోందని దీనికి కెసిఆర్ నాయకత్వమే కారణమంటూ రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శనివారం ట్వీట్ చేశారు. దీనికి మహాత్మాగాంధీకి చెందిన వ్యాఖ్యలను జోడించారు.

‘మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు
తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు
ఆ తరువాత మీతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఆ తరువాత మీరు విజయంసాధిస్తారు..’ మహాత్మాగాంధీ

ఇలాగే మే 2001లో ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అన్న కెసిఆర్ సాహసోపేత స్టేట్‌మెంట్‌ను ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు వెక్కిరించారు. ఎద్దేవా చేశారు. విరుచుకుపడ్డారు.. కానీ, నేడు దార్శనికుడైన కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది అంటూ 2001నాటి ఓ తెలుగు దినపత్రిక పేపర్ క్లిప్‌ను కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 2001 మే 17న కరీంనగర్‌లో జరిగిన సింహగర్జనలో కెసిఆర్ కేంద్రం మీద విరుచుకుపడి ప్రత్యేక తెలంగాణ సాధన గురించి ప్రస్తావించినప్పటి సంగతిని కెటిఆర్ శుక్రవారం జనగామ బహిరంగ సభలో ప్రకటనతో గుర్తు చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News