Wednesday, January 22, 2025

దక్షిణ భారతానికి ధాన్యాగారంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: దక్షిణ భారత దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిఎన్నార్ గార్డెన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన బిసి బందు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాకముందు గజ్వేల్ నియోజక వర్గంలో కనీసం తాగటానికి గుక్కెడు మంచినీళ్లు లేవు, వ్యవసాయానికి సాగునీరు లేకుండా కనీసం విద్యుత్ మోటార్లు పెట్టుకునేందుకు కరెంటు కూడా సక్కగ లేకుండేదని మంత్రి అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉండగా తెలంగాణ సాధించున్నామని, సిఎంగా కెసిఆర్ రావటంతో ఒక్కసారిగా గజ్వేల్‌తో పాటు తెలంగాణ రూపురేఖలే మారిపోయాయన్నారు. కాలేశ్వరం నుంచి గోదావరి నీటితో మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల ద్వారా చెరువులు నీటితో నింపుకుంటున్నామన్నారు. చెక్‌డ్యాములు కూడా పొంగిపొర్లుతునన్నాయన్నారు.

నిండు వేసవిలో కూడా నిండుకుండల్లా చెరువులు కళకళలాడుతున్నాయని మంత్రి చెప్పారు. భూమి మోయలేనంత అధికంగా పంట పండుతోందనాన్నారు. రైతులు 24 గంటల కరెంటుతో తమ అవసరాల మేరకు పొలాలకు నీరు పారిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేదని, కెసిఆర్ అంటే విశ్వాసం అని మంత్రి హరీష్ రావు చెప్పారు. మూడు గంటల కరెంటు చాలు అన్న పార్టీ కావాలో, మూడు పంటలు ఇచ్చే కెసిఆర్ కావాలో రైతన్నలు తేల్చుకోవాలన్నారు. కాలేశ్వరానికి కేంద్రంలోని బిజెపిప్రభుత్వం ఒక పైసా కూడా ఇవ్వకుండానే రూ.85 కోట్లు ఇచ్చినట్లు అబధ్దాలు చెపుతున్నదని ఇలాంటి జూటా పార్టీలకు రానున్న కాలంలో ప్రజలే తగిన సమాధానం చెపుతారన్నారు.

కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్షంగా..
కులవృత్తులను నమ్ముకున్న కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్షంతో వారికి ఆర్థిక సహాయం చేసే పధకమే బిసి బందు పధకమని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో కూడా బిసి కార్పోరేషన్ రుణాలు ఇచ్చేవారని అయితే అది అప్పుగా ఇచ్చేవారని, దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా మన సిఎం కెసిఆర్ ఉచితంగా రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆయన అన్నారు. బిసి కులాల్లో అన్ని కుల వృత్తులను సిఎం ప్రోత్సహిస్తున్నారన్నారు. ముదిరాజు. బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్ ,యాదవ సోదరులందరికీ మన సిఎం సంక్షేమ పధకాలను అందించారన్నారు.

కెసిఆర్ సారథ్యంలో ప్రభుత్వం తెచ్చిన పధకాలతో ఈ రోజు బిసిలు సామాజికంగా, ఆర్ధికంగా,విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు.నేడు ప్రతిపల్లె స్వయం సమృద్ది సాధించి ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయన్నారు. గ్రామీణ వృత్తులకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్ధిక వ్యవస్థకు ఊపిరి పోసే సంకల్పంతో సిఎం కెసిఆర్ ప్రభుత్వం యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోందన్నారు. మాంసం ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ నెం.1గా నిలిచిందన్నారు.బెస్త ,ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకంతో తెలంగాణ రాష్ట్రంలో మత్య పరిశ్రమ అభివృద్ది చెందటానికి సిఎం కెసిఆర్ చేసిన కృషి సత్పలితాలను ఇస్తోందన్నారు. ఈ రంగంపై ఆధారపడ్డ మత్య కారులకు ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి లభించే విధంగా వారికి ఉచితంగా వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను ఇచ్చి చెరువుల్లో పెంపకానికి ప్రోత్సహించి ప్రభుత్వం వారి ఆర్ధికాభివృద్దికి దోహదపడుతోందన్నారు.
గీత , చేనేత , మత్య కారులకు ప్రమాద బీమా
వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న గీత, బెస్త, మత్య కారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందన్నారు. గౌడ కులస్తులకు తాటి చెట్టుపై పన్నును రద్దు చేయటంతో పాటు పాత బకాయలను పూర్తిగా మాఫీ చేసిందన్నారు. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి పది సంవత్సరాలకు పెంచిందన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందన్నారు. వారికి చేనేత మిత్ర పధకం ద్వారా సబ్సిడీని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.బిసి కులాల విద్యార్ధులకు మంచి విద్యావంతులుగా చేయటానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోఉందన్నారు. తెలంగాణ రాకముదు 19 గురుకులాలు, 7580 మందిఆ విద్యార్ధులుండే వారని కానీ ఇప్పుడు 310 బిసి గురుకులాల్లో 2022-23 లో 33 స్కూళ్లను, 15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేశామనని చెప్పారు.

119 జూనియర్ కాలేజీలను ఈఅప్‌గ్రేడ్ చేశామని, 1,81,880 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.గత పాలకులకు రానీ ఆలోచన వారు చేయని సంక్షేమం మన సిఎం కెసిఆర్ చేస్తున్నారన్నారు. కెసిఆర్ రాక ముందు గజ్వేల్ ఒక వెనుకబడిన ప్రాంతంగా ఉండేదనాను. ఇప్పుడు కెసిఆర్ హయాంలో శంషాబాద్ రన్ వేను తలపించే రింగ్ రోడ్లు, విద్యాసధ, ంద పడకలతో రెండు ఆదునిక ఆసుపతత్రులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రతి గ్రామానికి పట్టణానికి విశాలమైన తారు రోడ్లువచ్చాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా బిసి కార్పోరేషన్ ద్వారా సుమారు 351 మంది బిసి బలబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా పరిషత్ ఛైర్మన్ వేలేటి రోజా రాధాక్రిష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా , గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, వివిధ మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News