Saturday, November 9, 2024

మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

దామెర: మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దామెర మండలం దుర్గంపేట గ్రామంలోని ఆర్‌కే కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన మహిళా సంక్షేమ దినోత్సవం నియోజకవర్గ స్థాయి వేడుకల్లో హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెలకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడ బిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్ద కొడుకులా.. కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మనసారా ఆశీర్వదించాలన్నారు.

మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు, మహిళల భద్రత, ఇలా ఎన్నో పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టి మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదని.. ఒక విప్లవం అన్నారు. బాల్య వివాహాలకు పుల్‌స్టాప్ పెట్టిందని, ఇంకో వైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని తెలిపారు. ఎంతో మంది పేద ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన మేనమామ సిఎం కెసిఆర్ అన్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా పరిష్కారం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి దేశంలోనే అత్యధిక పారితోషకాలు ఇచ్చి గౌరవ ప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదన్నారు. సంక్షేమ పతకాలు రావాలంటే మహిళల ఆశీర్వాదం సిఎం కెసిఆర్‌ర్‌పై ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ, పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల మహిళా అధికారులు, ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఐకేపీ ఏపీఎంలు, వీఓఏలు, ఏపీఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఓలు, ఏఈఓలు, టీఏలు, ఏసీపీ, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News