Monday, December 23, 2024

మహిళ సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • స్ధానిక సంస్థల్లో మహిళలదే పైచేయి: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: మహిళా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.

గత పాలకులు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా నిర్లక్షం చేశారని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మహిళలకు నీటి కష్టాలు తీరాయని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్‌లు, ఆసరా పింఛన్ల వంటి అనేక పథకాలను మహిళల కోసమే ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కొడంగల్, బోంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఉన్న 4 వేల మహిళ సంఘాలు రూ. 4 వందల కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

68 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు త్వరలో నిర్మించడంతో పాటు రూ. 50 లక్షలతో ఐసిడిఎస్ కార్యాలయ భవన నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. జులై నుంచి ప్రభుత్వం చేపట్టె గృహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రాధాన్యత దక్కనుందని పేర్కొన్నారు. అనంతరం రూ.5 కోట్ల చెక్కులను మహిళ సంఘాలకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి కృష్ణన్, మార్కెట్ కమిటీ చెర్మెన్ సుజాత, వైస్ చైర్మన్ వాణీశ్రీ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News