Saturday, November 23, 2024

వైద్య రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శం: సత్యవతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో మారుమూల ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాలో నూతన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుని తరగతులు ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో నూతన మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్ తరగతులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టమని ప్రశంసించారు. వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఇది మంచి అవకాశమని ప్రశంసించారు.  ఏజెన్సీలోని పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునేందుకు అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కు రుణపడి ఉంటామన్నారు.

నూతన మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు పెద్ద వ్యాధి వచ్చిన హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోని నాణ్యతతో కూడిన చికిత్స లభిస్తుందిని సత్యవతి తెలిపారు. మెడికల్ కాలేజ్ అంటే కేవలం విద్యా వ్యవస్థ మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా అనేక వసతులు ఏర్పడతాయని వివరించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ అందుబాటులోకి వస్తుందిని తెలిపారు. అంతే కాకుండా వీటిలో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారాని, దీంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఇలాంటి సువర్ణ అవకాశాలు కల్పించిన సిఎం కెసిఆర్ కు జిల్లా ప్రజల తరపున మరోసారి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News